Site icon Prime9

YSRCP: వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా

MLC Venkata Ramana Resign To YSRCP: వైసీపీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందిన నాటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకట రమణ తాజాగా తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇదీ నేపథ్యం
బీసీ వర్గానికి చెందిన జయమంగళ వెంకట రమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పని చేసి 2005లో కైకలూరు జడ్పీటిసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పొత్తు కారణంగా ఆయనకు సీటు దక్కలేదు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఫిబ్రవరి 17న వైసీపీలో చేరిన రమణ.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఎమ్మెల్సీకీ రాజీనామా
జయమంగళ వెంకటరమణ శనివారం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన శాసన మండలి సభ్యత్వానికీ కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌ మోషేనురాజుకు పంపించినట్లు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar