Prime9

Botsa Satyanarayana: స్టేజ్ పై కుప్పకూలిన బొత్స.. ఆస్పత్రికి తరలింపు!

Botsa Satyanarayana Falls Down on Stage: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతతో కుప్పకూలారు. రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం పేరుతో పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన చేస్తుండగా అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ మట్లాడుతుండగానే కిందపడిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో పార్టీ శ్రేణులు, బంధువర్గాల్లో ఆందోళన నెలకొంది.

 

Exit mobile version
Skip to toolbar