Site icon Prime9

Visakhapatnam corporators: కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకున్న కార్పోరేటర్లు

Visakhapatnam corporators: గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడటంతో వీరు మధ్యలో చిక్కుకున్నారు. గత రాత్రి మనాలి నుండి చండీగఢ్ వెళుతుండగా మార్గ మధ్యలో లారీపై కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎటు వెళ్లేందుకు ఆస్కారం లేక, రాత్రి నుండి కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు తాము ప్రయాణిస్తున్న బస్సులో చిక్కుకుపోయారు

విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్నారు. వీరందరూ నిన్న కులు మునిసిపాలిటీ లోని పలు ప్రాంతాలను సందర్శించారు.

Exit mobile version