Site icon Prime9

Vijayawada: సంక్రాంతికి ఏపీకి వెళ్లేవారికి శుభవార్త – అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్‌

Vijayawada West Bypass Alleviates: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంత సొంత ఊళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ కిటకిటలాడుతుంది. టోల్ గేట్స్‌ రద్దిగా మారాయి. దీంతో రోడ్డుపై గంటలు గంటలు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ట్రాపిక్‌ తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు జర్నీ సమయాన్ని తగ్గించింది.

హైదరాబాద్‌ నుంచి వస్తున్న వాహనాలను విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్‌ మీదుగా మళ్లీస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ రోడ్డు గుండా వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్‌ రద్ది పెరిగిపోతుంది. దీంతో వాహనాలు కదిలేసరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం పశ్చిమ బైపాస్‌ రోడ్డును తెరిచి దాని మీదుగా వాహనాలు మళ్లీస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి అన్నఅవుటపల్లి వరకు 30 కి.మి మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్‌ నిర్మాణానికి శంకస్థాపన చేశారు.

2020లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తక్కువ ఎత్తులో ఉననప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించారు. దీంతో సంక్రాంతి రద్దీని దృష్ట్యా ఈ బైపాస్‌ రోడ్డుని తెరిచి వాహనాలు మళ్లీస్తున్నారు. శుక్రవారం నుంచి దీని నుంచి రాకపోకలకు అనుమతిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో వాహనాలకు అనుమతి లేదు. హెవీ వెహికిల్స్‌ బస్సులకు బైపాస్‌ నుంచి వెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలకు అనుమతి ఇవ్వనుంది.

Exit mobile version