Site icon Prime9

Tirupati : టీటీడీ గోశాలకు గుంపులుగా వెళ్లొద్దు : పోలీసుల సూచన.. భూమనకు అనుమతి

Tirupati

Tirupati

Tirupati : టీటీడీ గోశాలకు గుంపులుగా రావొద్దని రాజకీయ పార్టీల నాయకులకు తిరుపతి పోలీసులు సూచించారు. కూటమి ప్రజాప్రతినిధులు, వైసీపీ మాజీ భూమన కరుణాకర్‌రెడ్డి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి ర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా గన్‌మెన్‌లతో గోశాలను సందర్శించవచ్చన్నారు. ఆ తర్వాత మీడియాతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మాట్లాడి వెళ్లిపోవాలని నేతలకు పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నేత భూమన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

 

భూమనను గృహనిర్బంధం చేయలేదు : తిరుపతి ఎస్పీ
గోశాలకు సందర్శనకు వెళ్లేందుకు భూమన కరుణాకర్‌రెడ్డికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఆయన్ను గృహనిర్బంధం చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని సూచించినట్లు ఎస్పీ తెలిపారు.

 

గోశాలకు వెళ్లేందుకు భూమనకు అనుమతి..
గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసుల అనుమతి లభించింది. ఈ రోజు ఉదయం భూమనను హౌస్ అరెస్టు చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అరెస్టును పోలీసులు ఖండించారు. భూమనను గృహనిర్బంధం చేయలేదని తిరుపతి ఎస్పీ స్పష్టం చేశారు. గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్లాలని సూచించారు.

 

 

Exit mobile version
Skip to toolbar