Site icon Prime9

Kurnool Holi tradition : పురుషులంతా ఆడవారిలా మారిపోతారు.. కారణం ఇదే అంటున్న గ్రామస్తులు?

Kurnool

Kurnool Holi tradition : దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. కొన్ని చోట్ల డీజే పాటలు పెట్టుకుని రంగులు చల్లుకుంటూ ఆడి పాడారు. హోలీని కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. పలు చోట్ల వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాలను పాటిస్తూ గ్రామాల్లో హోలీ సంబురాలు జరుపుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ వింత ఆచారం ఉంది. ఆ ఊరిలో రెండు రోజులపాటు ఆచారాన్ని పాటిస్తూ హోలీని జరుపుకుంటారు. ఇంతకీ ఏంటా ఆచారం ఇప్పుడు తెలుసుకుందాం..

 

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా వింత ఆచారాన్ని కొనసాగిస్తుంటారు. గ్రామంలోని పురుషులంతా మహిళల వేషధారణలో మారిపోతారు. వింత ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను జరుపుకుంటారు. పురుషులంతా మహిళ వేషధారణలో రతి మన్మథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా హోలీ పండుగ జరుపుకోవడం విశేషం. అక్కడ పురుషులు మహిళల వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు, కాటకాలు రావని స్థానికుల నమ్మకం. కరువు, కాటకాలు రాకుండా గ్రామంలో పురుషులంతా చీర కట్టడం తప్పదు మరి.

 

పురుషులు ఆడవారిగా చీరలు, ఆభరణాలు పెట్టుకుని అమ్మాయిల తయారవుతారు. ఇలా చేయడం వల్ల కోరిక కోర్కెలు తీరుతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి వింత ఆచారాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా పురుషులంతా ఆడవారి వేషధారణలోకి మారిపోయి రతి మన్మథుడికి పూజిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందనే వారి విశ్వాసం. ఇలా ఏటా రెండు రోజులపాటు మగవారంతా మహిళల వేషధారణలో పూజలు చేస్తుండటమే అక్కడి ప్రత్యేకత.

Exit mobile version
Skip to toolbar