Site icon Prime9

Visakhapatnam Municipal Corporation : సంచలన పరిణామం.. విశాఖ జీవీఎంసీ పీఠం కూటమిదే

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam Municipal Corporation : కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌పై నెలకొన్న పరిస్థితులకు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసం చేసుకుంది. రాజకీయ కీలక నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఇన్‌చార్జి కమిషనర్, కలెక్టర్‌ హరేంధీర ప్రసాద్‌ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు విశాఖ మేయర్ హరి వెంకటకూమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ నేతలు బహిష్కరించారు.

 

కూటమి నేతల సంబురాలు..
వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చారు. అనంతరం ఒకరునొకరు స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకున్నారు.

 

రెండు నెలలుగా నాటకీయ పరిణామాలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. కొద్ది రోజులుగా మేయర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఉండటంతో ఆమెపై అవిశ్వాసం పెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. అప్రమత్తమైన వైసీపీ తమ పార్టీ కార్పొరేటర్లను వెంటనే అక్కడి నుంచి విదేశాలకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. దీంతో విశాఖ మేయర్ పీఠంపై రెండు నెలలుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేడు ముగింపు పడింది. తర్వాతి మేయర్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar