25% free admissions for poor students in all private schools in AP: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి 25 శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
నోటిఫికేషన్ విడుదల..
పేదవిద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తాజాగా రిలీజ్ చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సమగ్రశిక్ష డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ప్రకటించారు. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు నమోదు చేయాలని ఆదేశించారు.
మే 15వరకు దరఖాస్తు చేసుకోవాలి..
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుకు చిరునామా ధ్రువీకరణ తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటరు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు అవసరం ఉంటుంది. విద్యార్థుల వయస్సు 1.6.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి. వెబ్‌సైట్ https://cse.ap.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టూడెంట్స్ తల్లిదండ్రులు గ్రామ సచివాలయం, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాలల్లో మే 15వ తేతీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. టోల్‌ఫ్రీ నెంబర్ 18004258599కు ఫోన్ చేయాలని సూచించారు.