Site icon Prime9

AP Cabinet Decisions : ముగిసిన ఏపీ కేబినెట్‌.. పలు కీలక నిర్ణయాలు

AP Cabinet Decisions

AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్‌ ముగిసింది. ఈ మేరకు 14 అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పు చేర్పుల నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కేడర్ రేషనలైజేషన్‌పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పౌరసేవలు ప్రజలకు అందేలా కేడర్‌లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరోవైపు కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెట్‌వర్క్ కేంద్రం ఏర్పాటుపై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెంట్రల్ పూల్‌లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు సమర్పించగా, వాటికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా పదెకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గీత కార్మికులకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాలను సొండి కులాలకు కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది. 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Exit mobile version
Skip to toolbar