Mahanati Seva Awards : మహానటి సావిత్రి కళా పీఠం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానటి సేవా పురస్కారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ వేడుకల్లో సావిత్రి మేనల్లుడు బడే ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇందులో భాగంగా పలు సేవ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తోట నాగబాబుకు ఈ అవార్డు వరించింది. అందుకు గాను నాగబాబు సావిత్రి కుటుంబ సభ్యులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక స్పృహతో ప్రజలకు నిరంతరం మంచి చేయాలనే తపనతో సామాజిక సేవలు నిర్వహిస్తున్న తోట నాగబాబుకు అవార్డు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో ప్రజలకు మరింతగా సేవ కార్యక్రమాలు చేయాలని.. ఇటువంటి పురస్కారాలు మరిన్ని వరించాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు.