Prime9

Silk Saree : చీరాల ‘సిల్క్‌ చీర’కు జాతీయస్థాయి గుర్తింపు

Award for Kuppadam Saree : చీరాల సిల్క్‌ చీరకు అరుదైన అవార్డుతోపాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళి ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు.

 

జనవరిలో బాపట్ల కేంద్ర బృందం సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతంలో మగ్గాలపై నేతనేసే కుప్పడం చీరలను పరిశీలించారు. అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్లు అధికారికంగా జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం సమాచారం అందింది. కుప్పడం చీరకు అవార్డు రావడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు వచ్చిందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar