Site icon Prime9

Drought Hit Mandals : కరువు మండలాలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

Drought Hit Mandals

Drought Hit Mandals

Drought Hit Mandals : కరువు ప్రభావిత మండలాలను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు. వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

 

కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 51 కరువు ప్రభావిత మండలాలను ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రౌట్ మేనేజ్‌మెంట్ మాన్యువల్ ప్రకారం రైతులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం వేసవి తీవ్రతను పర్యవేక్షిస్తోందని, అవసరమైన నిధులు, సబ్సిడీలు, సహాయక కార్యక్రమాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar