Site icon Prime9

Ram Gopal Varma: విచారణకు ఆర్జీవీ డుమ్మా.. 4 రోజులు సమయం కావాలని మెసేజ్

Ram Gopal Varma request to Message: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టాడు. తనపై నమోదైన కేసులో ఇంకా నాలుగు రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అయితే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని మెసేజ్‌తలో పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై పలుమార్లు ఆర్జీవీ అసభ్యకర పోస్టులతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. దాదాపు 5 రోజుల క్రితం పోలీసులు స్వయంగా హైదరాబాద్ నగరానికి వచ్చి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీని విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పోలీసులకు ఆర్జీవీ మెసేజ్ చేయడం సంచలనంగా మారింది.

అయితే తను విచారణకు రాలేనని, తనకు మరింత సమయం కావాలని ఒంగోలు సీఐ కార్యాలయానికి పంపించిన మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని, తప్పకుండా త్వరలోనే విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. అంతకుముందు తనపై కేసు నమోదైన తర్వాత రక్షణ కల్పించేందుకు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు సులభమైందని సమాచారం.

ఇదిలా ఉండగా, ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ సమయంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసిన్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version