Prime9

Amaravati: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

‘క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు

ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్

దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : సీఎం చంద్రబాబు

 

 

Anaravati: అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది ఒకటో తేదీన క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్​ టూబ్రో సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకం అని అన్నారు. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు.

 

సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం తెలిపారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయని వెల్లడించారు.అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు.

అమరావతి ప్రజల రాజధాని:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతిని ప్రజల రాజధానిగా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు 28 మందిని చంపేశారని..ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ప్రధాని మోదీ వచ్చారని ఆయన చెప్పారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా నిలుస్తుందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిని వైసీపీ పట్టించుకోలేదని..రాజధాని రైతులను వేధించిందని మండిపడ్డారు.


వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి:సీఎం చంద్రబాబు
మోదీ నాయకత్వంలో దేశం దూసుకెళ్తోందన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా చేస్తామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం.

Exit mobile version
Skip to toolbar