Site icon Prime9

Amaravati Capital : అమరావతి పనుల ప్రారంభానికి సిద్ధం.. ప్రధాని మోదీకి కూటమి సర్కారు ఆహ్వానం

Amaravati Capital

Amaravati Capital : ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని అడ్డంకులు అధిగమించింది. ఈ క్రమంలోనే రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కూటమి సర్కారు ఆహ్వానించింది. రెండు రోజుల కింద సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై అమరావతి నిర్మాణంపై చర్చించారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉండడంతో ప్రధాని చేతుల మీదుగా రాజధాని ప్రారంభోత్సవం చేయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దీనికోసం ఏప్రిల్‌లో రెండు తేదీలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రధాని మోదీ ఇచ్చే అపాయింట్‌మెంట్‌ ప్రకారం అందులో ఏదో ఒక తేదీ ఖరారు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

 

ఏప్రిల్ 3 వారంలో ప్రధాని ఏపీకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరావతి ప్రాంతంలో నవ నగరాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ సిటీల్లో ఏదో ఒకటి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతిలో రూ. 64,721 కోట్లతో 73 పనులను అంచనా వేసింది. 73 పనుల్లో 63 పనులకు టెండర్లు పూర్తి చేశామని ఇప్పటికే మంత్రి నారాయణ వెల్లడించారు. పనుల విలువ రూ. 39,678 కోట్లు అని విషయం విదితమే. అమరావతి నిర్మాణాలపై అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల భవనాల నిర్మాణాలు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత సంస్థలకు లేఖలు ఇస్తామని మంత్రి తెలిపారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ. 13,400 కోట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చాయని, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ. 5వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు అనుమతి వచ్చిందని తెలిపారు. కేంద్రం గ్రాంట్‌ కింద రూ. 1560 కోట్లు ఇస్తుందని మంత్రి వెల్లడించిన విషయం విదితమే.

Exit mobile version
Skip to toolbar