Prime9

Pawan Kalyan on Nature: ప్రకృతిని రక్షించుకుంటేనే మనిషి బతుకుతాడు: పవన్

Pawan Kalyan Speech in Tummalapalle about Nature: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని. వనజీవి రామయ్య జీవితం మొత్తంలో లక్షల మొక్కలు నాటారని చెప్పారు. మడ అడవులు సహజంగా ఏర్పడ్డాయి.. సముద్రం దగ్గర ఉంటూ మనలని రక్షిస్తాయి. ఇటీవల మడ అడవులను కూడా నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యతని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్ ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

 

 

Exit mobile version
Skip to toolbar