Site icon Prime9

Weather Update : ఏపీ ప్రజలకు చల్లని కబురు.. మరో మూడు రోజుల్లో రుతుపవనాల రాక

rain alert for telugu states ap and telangana in upcoming days

rain alert for telugu states ap and telangana in upcoming days

Weather Update : ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బయటకు రావలంటేనే భయపడేలా చేస్తున్న ఈ ఎండలకు  మరో రెండు రోజుల్లో గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నెల 19 నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అలానే కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శనివారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఈ శనివారం, ఆదివారం వాడగలఉలు వీచే అవకశశాం ఉందని అంచనా వేస్తున్నారు. శనివారం నాడు.. 264 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు, ఆదివారం 42 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 203 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు.

అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి. ఈ గాలులు సముద్రంలోనూ, ఉపరితలంలోనూ బలంగా ఉండాలి అంటున్నారు. సముద్రానికి మూడు మీటర్ల ఎత్తులో ఈ గాలులు ఏర్పడాల్సి ఉంటుంది.. అప్పుడే రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతాయి. ఈ ఏడాది మాత్రం అరేబియన్‌ సముద్రంలో ఇంత తీవ్రమైన తుఫాన్‌ రాలేదు. ఈ గాలులను తుఫాన్‌ లాక్కుపోవడంతో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాల రాక ఆలస్యమైంది.

Exit mobile version
Skip to toolbar