Site icon Prime9

Former MLA Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీకి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ కొట్టివేసిన హైకోర్టు

High court Big shock to Former MLA Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, కేసు వెనక్కి తీసుకోవాలని దాడి వంటి కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీ విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar