Site icon Prime9

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో బిగ్ షాక్

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy : సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి మరో బిగ్ షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టడాలు నిర్మించింది. దీంతో జీవీఎంసీ అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ అయింది. దీంతో కూల్చి వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈఎక్స్ 200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను 10 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగిస్తున్నారు.

 

భీమిలి బీచ్‌ దగ్గర సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తి యాదవ్‌ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భీమునిపట్నం సీఆర్‌జడ్‌ జోన్‌ పరిధిలో శాశ్వత రెస్ట్రోబార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికికి ప్రమాదం పొంచి ఉందని గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిటిషన్ వేశారు. గతంలో వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపి, సీఆర్‌జడ్‌ పరిధి నిర్ణయించి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది.

Exit mobile version
Skip to toolbar