Site icon Prime9

RK Roja : కూటమి పాలనలో దేవదేవుడికి నిద్ర కరువు.. మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్

Former Minister RK Roja

Former Minister RK Roja

RK Roja : ఏపీలో కూటమి సర్కారుపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఫైర్‌ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడన్నారు. ఇవాళ ట్విటర్‌‌లో కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పట్టడం లేదని విమర్శించారు. సంప్రదాయం ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలన్నారు. అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసం కూడా అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని చెప్పారు. వైఎస్‌ జగన్‌ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేదని వెల్లడించారు.

 

 

సామాన్య భక్తులకు దర్శనం దూరం..
కూటమి ప్రభుత్వ హయాంలో స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారని విమర్శించారు. దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శన భాగ్యం మరింత దూరమవుతోందని మండిపడ్డారు. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. సమూల ప్రక్షాళన అంటే ఇదేనా అంటూ చంద్రబాబును ఆమె ఎక్స్‌ వేదికలో ప్రశ్నించారు.

Exit mobile version
Skip to toolbar