Fire Accident in Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్ – 2 మిషన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో కేబుల్స్‌తో పాటు మిషన్ పరికరాలు దగ్ధమయ్యాయి. ఈ కారణంగా ప్రొడక్షన్స్‌కి అంతరాయం ఏర్పడింది.
మిషన్- 2లో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ లీక్ కావడంతో పాటు నిప్పు రవ్వలు ఆయిల్‌పై పడడంతో మంటలు వ్యాపించినట్లు తెలిపారు. కాగా, కేబుల్, మిషనరీల నుంచి మంటలు ఎగిసిపడి పొగ చుట్టుముట్టినట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.