Site icon Prime9

Deputy CM Pawan Kalyan: ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డు.. గ్రామాల పరిశుభ్రతే మనందరి బాధ్యత

Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు.

గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు సమర్థంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.

గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇందు కోసం ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version