CM Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 12:08 PM IST

Tirumala: తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రంతో సత్కారించారు. అనంతరం సీఎం జగళూరుకు చెందిన మురళీకృష్ణ సహాయంతో అన్నదానం సముదాయం పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పరకామణి మండపాన్ని ప్రారంభించారు. త్వరలోనే శ్రీవారి ఆలయంలోని పరకామణిని టీటీడీ ఆలయం వెలుపలికి తరలించనున్నది.

పరకామణి మండపం ప్రారంభం అనంతరం నేరుగా బాలాజీనగర్ వద్దకు చేరుకొని, రాజ్యసభ సభ్యుడు నూతనంగా నిర్మించిన విపిఆర్ అతిధి గృహాన్ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనం పై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.