Site icon Prime9

Tirumala : టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ : చైర్మన్ బీఆర్ నాయుడు

Tirumala

Tirumala

Tirumala : టీటీడీ శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని చైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్‌ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. బోర్డు తీర్మానాలను ఆయన వివరించారు.

 

 

 

బోర్డు చేసిన తీర్మానాలు..

1. ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్టు.
2. టీటీడీ ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీ ఏర్పాటు.
3. టీటీడీకి చెందిన భూముల న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు.
4. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం.
5. వచ్చే ఏడాదిలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక చర్యలు.
6. గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం.
7. శ్రీనివాస సేవా సమితి పేరుతో స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం.
8. టీటీడీ మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం.
9. తిరుమలలో అనధికార హాకర్లు తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ.
10. వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయింపు. ప్రయోగాత్మకంగా పూర్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం.
11. రూ.5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్‌కు ఆమోదం.
12. రూ.772 కోట్లతో గదుల ఆధునికీకరణకు నిర్ణయం.

Exit mobile version
Skip to toolbar