Site icon Prime9

Maha Shivaratri 2025: గుడ్‌న్యూస్.. శివరాత్రికి ప్రత్యేక బస్సులు

APSRTC to operate 3500 special buses for Maha Shivaratri 2025: శివరాత్రి పండుగ వేళ ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మహా శివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఏపీఎస్‌ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లి వచ్చేందుకు వీలుగా 3,500 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ కేటాయించింది. అత్యధికంగా వైఎస్‌ఆర్ జిల్లాలోని 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలోని 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలోని 7 క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేసింది.

Exit mobile version
Skip to toolbar