APSDC Servers Down: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర డేటా సెంటర్ (ఎస్ డీసీ) సర్వర్ డౌన్ అయింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఐటీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సర్వర్ డౌన్ తో ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ ఆధారిత సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సేవలు నిలిచిపోయాయి. డేట్ సెంటర్ సర్వర్ డౌన్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సర్వర్ డౌన్ సమస్య ఏపీ సచివాలయానికి తాకింది. శాసనసభ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర సమస్య తలెత్తింది.
మంగళవారం ఉదయం నుంచి ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో నెట్ నిలిచిందని అధికారులు చెబుతున్నారు.
అయితే , నెట్ వర్క్ సమస్య తలెత్తిన కొద్ది సమయానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ నెట్ కనెక్టివిటీ పునరుద్దరణ కాలేని పరిస్థితి నెలకొంది.
ఇంటర్నెట్ లేకపోవడంతో అసెంబ్లీ, సచివాలయాలలో ఫేస్ రీడింగ్ డివైజ్ లు పనిచేయలేదు.
మరోవైపు అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సర్వర్ డౌన్ అవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సర్వర్ డౌన్ అయిందని అధికారులు అంటున్నారు. ఈ సాంకేతిక లోపాన్ని పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.
5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.
ఏపీలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.
డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు.
45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గవర్నర్నజీర్ తన ప్రసంగంలో చెప్పారు