Site icon Prime9

Ayyappa Devotees: అయ్యప్ప భక్తులు సేఫ్.. కూటమి ప్రభుత్వం చొరవతో దర్శనం

AP Govt initiative Ayyappa Devotees: కూటమి ప్రభుత్వం చొరవతో కేరళలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు క్షేమంగా దర్శనానికి వెళ్లారు. నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు కేరళ వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వారికి రోడ్డు ప్రమాదం జరగడంతో కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తమ తప్పు లేకున్నా కేరళ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, దర్శనం ఉందని చెబుతున్నా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై స్పందించిన ఏపీ ప్రభుత్వం కేరళ అధికారులతో మాట్లాడి వారిని విడిపించి శబరిమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాట్లు చేయించారు.

Exit mobile version