Site icon Prime9

Pawan Kalyan Araku Visit: అర‌కు ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్

AP Deputy CM Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan Araku Visit: కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండోరోజు ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి, రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు.

 

కురిడిని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కల్యాణ్ మాట్లాడారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలు అందజేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖల సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ప్రకటించారు.

 

వలంటీర్ల‌ను మోసంచేసిన వైసీపీ..
వలంటీర్లకు సంబంధించి వైసీపీ సర్కారు ఎలాంటి ఆధారం లేకుండా చేశారని పవన్ అన్నారు. ఈ విషయంపై మంత్రి లోకేష్‌తో కేబినెట్‌లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. వలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో తనకు తెలిదన్నారు. వలంటీరు జీతాలు ఎలా ఇచ్చారో నాయకులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. గత వైసీపీ సర్కారు వలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేసిందని ఆరోపించారు. వలంటీర్ల పేరుతో ఉద్యోగాలు అని చెప్పి మాయచేశారని, ఇప్పటికే 25 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు.

 

సికిల్ సెల్ అనీమియా వ్యాధి బాధితులకు బ్లడ్ అవసరం..
గిరిజ‌న ప్రాంతాల్లో ఉన్న సికిల్ సెల్ అనీమియా వ్యాధి బాధితులకు బ్లడ్ అవసరమని పవన్ తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులతో బ్లడ్ ఏర్పాటు చేయాలన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి డ్రైవ్ చేసి గుర్తించాలని, దీన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి అంగన్‌వాడీలతో పోషక పదార్థాలు అందించడానికి కృషి చేస్తానన్నారు. 2018లో ఇక్కడికి వచ్చిన సమయంలో సమస్యలు తనకు గుర్తు ఉన్నాయని తెలిపారు. అందుకే మళ్లీ ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.

 

2.50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో కాఫీ సాగు..
అర‌కు ప్రాంతంలో 2.50 ల‌క్ష‌ల‌ ఎకరాల్లో కాఫీ పంట పండిస్తున్నారని తెలిపారు. దింసా డాన్స్ చేసే వాళ్లకు, ఉసిరి, స్టాబేర్రి, లాంటి పంటలు వేసి ఉమ్మడి సాగు చేస్తే జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ, మార్కెటింగ్ శాఖ ద్వారా పండించిన పంటలను విశాఖలో మార్కెటింగ్ చేస్తానని తెలిపారు. కురిడి గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుని వాణిజ్య పంటలు పండించటానికి మార్గాలు వెతుకుతామన్నారు. నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. సినిమా, టీవీ సీరియల్ వారికి వసతులు ఏర్పాటు చేయాలన్నారు.

 

ప్రతిఒక్కరూ తులసి మొక్క నాటాలి..
కుల ధ్రువీకరణ పత్రాలు కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పవన్ హామీనిచ్చారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వద్దని, గంజాయి కంటే తులసి మొక్క నాటాలని సూచించారు. తాను గిరిజనుడిగా పుట్టలేదు కానీ, వారి కోసం ఆలోచన ఉందన్నారు. కేరళ టూరిజం మోడల్‌ను దృష్టిలో పెట్టుకుని అరకు టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని పవన్ స్పష్టం చేశారు.

 

Exit mobile version
Skip to toolbar