Site icon Prime9

AP CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఏపీ ఆదాయంలో 2.2 శాతం వృద్ధి

AP CM Chandrababu Review Meet on State Income: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సొంత ఆదాయ వనరులు పెరిగితేనే నిజమైన వృద్ధి చెందుతుందన్నారు. అయితే,పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అధికారులకు సూచనలు చేశారు. కాగా, రాష్ట్ర ఆదాయం రూ.1.37 లక్షల కోట్ల లక్ష్యం ఉండగా.. ఆ సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

 

అంతేకాకుండా, సొంతంగా ఆదాయం పెంచుకోవడంతో పాటు పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో తెలుసుకోవాలన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ విజయవంతమైందని, అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.4,330 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar