Site icon Prime9

Andhra Pradesh: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్‌పై నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations

Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations

Andhra Pradesh Governmnet guidellines released on sc classification and reservations: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సర్కార్ గెజిట్ జారీ చేసింది. తాజాగా, ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలు రిలిజ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఇందులో గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ వర్తించనుండగా.. గ్రూప్ 2లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3లో మాల సహా 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించింది. మొత్తం ఎస్సీ వర్గీకరణ కింద 15 శాతం వర్తించనుంది.

 

అలాగే ఉద్యోగాల విషయానికొస్తే.. 200 రోస్టర్ పాయింట్లు అమలు చేయనుంది. అంతేకాకుండా 3 కేటగిరిల్లో మహిళలకు 33.3శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, అర్హులు లేని సమక్షంలో తదుపరి నోటిఫికేషన్‌కు ఖాళీలను బదిలీ చేయనుంది.కాగా, ఈ మార్గదర్శకాలు, నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar