Site icon Prime9

Andhra Pradesh : ఉపాధ్యాయురాలిని చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh News : ఈ రోజుల్లో కొందరు స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే.. ఇవేం చదువులు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు భయపడేవారు. టీచర్లు అంటే గౌరవం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్‌గా ఉంది. ఉపాధ్యాయులపై జోకులు వేయడం వంటివి చేస్తున్నారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థులను టీచర్లు కొడితే.. తల్లిదండ్రులు మా అబ్బాయిని కొడతారా..? మా అమ్మాయిని బెరిస్తారా? అంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలిపై చెప్పుతో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

 

ఉపాధ్యాయురాలు తన మొబైల్ తీసుకుందని విద్యార్థిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన విశాఖపట్నం, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సెల్ ఫోన్ మాట్లాడుతుండగా ఉపాధ్యాయురాలు చూసింది. వెంటనే ఉపాధ్యాయురాలు విద్యార్థిని దగ్గర మొబైల్ ఫోన్‌ను తీసుకుంది. దీంతో విద్యార్థిని కోపంతో ఊగిపోయింది. చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు అని చూడకుండా తిట్టింది. అక్కడితో ఆగకుండా తన కాళ్లకు ఉన్న చెప్పు తీసి చెంపపై కొట్టింది. తోటి విద్యార్థులు విడిపించే ప్రయత్నం చేసినా విద్యార్థిని వెనక్కి తగ్గలేదు. ఇది చూసిన తోటి ఉపాధ్యాయులు ఇదేమి విషసంస్కృతి అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ దృశ్యాలను ఓ విద్యార్థి తన మొబైల్‌లో చిత్రీకరించడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

 

Exit mobile version
Skip to toolbar