Lifestyle: లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన గ్లోబల్ అధ్యయనం ప్రకారం, వృద్ధుల కంటే యువకులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. భౌగోళిక ప్రాంతం, వయస్సు, లింగం మరియు సంవత్సరం ఆధారంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన కలిగే పరిణామాలను ఈ అధ్యయనం పేర్కొంది.
ఆల్కహాల్ సేవించే జనాభాలో అత్యధిక భాగం 15-39 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఎక్కువమంది వున్నారు. వీరికి మద్యం సేవించడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు సరికదా అనేక ఆరోగ్య ప్రమాదాలను అందజేస్తాయని పరిశోధకులు తెలిపారు. మోటారు వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు మరియు హత్యలతో సహా ఈ వయస్సులో ఉన్న వ్యక్తులలో 60 శాతం మంది మద్యం తాగడం వల్లే సంభవిస్తాయని వారు తెలిపారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా 40 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు, తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల హార్ట్ డిసీజ్, స్ట్రోక్ మరియు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడం వంటి కొన్ని ప్రయోజనాలు వుంటాయని పరిశోధకులు తెలిపారు.
మా సందేశం ఏమిటంటే యువకులు తాగకూడదు, కానీ వృద్ధులు తక్కువ మొత్తంలో తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు” అని యుఎస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ ఇమ్మాన్యులా గకిడౌ అన్నారు. యువకులు మద్యపానానికి దూరంగా ఉండరని అయితే ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం గురించి శ్రద్ద చూపేలా తెలియజేయడం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నామని గకిడౌ చెప్పారు.
1990 మరియు 2020 మధ్య 1990 మరియు 2020 మధ్య 204 దేశాలు మరియు భూభాగాలలో 15-95 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు మరియు ఆడవారి కోసం 2020 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాను ఉపయోగించి గాయాలు, హృదయ సంబంధ వ్యాధులు మరియు క్యాన్సర్లతో సహా 22 ఆరోగ్య ఫలితాలపై ఆల్కహాల్ వినియోగం యొక్క ప్రమాదాన్ని పరిశోధకులు పరిశీలించారు. .