Drinks To Reduce Belly Fat: ఈ రోజుల్లో.. శరీరంలో పెరుగుతున్న బెల్లీ ఫ్యాట్ మన అందాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారుతోంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత సులభం కాదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన జీవనశైలి వల్ల తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల కూడా ఈ మొండి కొవ్వు తగ్గుతుందని మీకు తెలుసా ? ఈ డ్రింక్స్ మీ జీవక్రియను కూడా వేగవంతం చేస్తాయి.
అంతే కాకుండా శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. కొవ్వును కరిగించే ప్రక్రియను మెరుగుపరుస్తాయి. రాత్రిపూట వీటిని తాగడం ద్వారా మీరు క్రమంగా మీ బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చు. మరి ఎలాంటి డ్రింక్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నిమ్మకాయ నీరు:
పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండి తాగితే చాలా మంచి డీటాక్స్ డ్రింక్ అవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతినిస్తుంది. అంతే కాకుండా మంచి నిద్రను పొందడంలో కూడా సహాయపడుతుంది.
దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరం యొక్క వేడిని పెంచడం ద్వారా జీవక్రియను సక్రియం చేస్తాయి. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మరిగించి, పడుకునే ముందు తాగాలి. ఈ టీ చక్కెరను నియంత్రించడమే కాకుండా.. రాత్రిపూట బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మెంతి నీరు:
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, వేడి చేసిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ నెమ్మదిగా ఉండే వారికి ఈ డ్రింక్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
చమోమిలే టీ:
చమోమిలే టీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర శరీరంలో హార్మోన్ల సమతుల్యతను సృష్టించడం ద్వారా కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. ఈ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా జీవక్రియను పెంచుతాయి.
వాము నీరు:
వామును నీటిలో మరిగించి తయారుచేసిన టీ గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు వామము నీరు శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. ఉదయం పూట కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పసుపు పాలు:
పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది ఈ డ్రింక్ బరువును తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.