Site icon Prime9

Smart Watches: మరింత స్మార్ట్ గా.. స్మార్ట్ వాచీలు

Smart watches

Smart watches

Smart Watches: ఇప్పుడంతా స్మార్ట్‌ యుగం నడుస్తుంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, ఇంట్లో స్మార్ట్‌ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్‌ వాచ్‌ కూడా ఉండి తీరాలంటున్నారు ఇప్పుడున్న యువత. అప్పుడే అప్‌డేటెడ్‌గా ఉన్నట్టు అంటున్నారు. అంతేకాకుండా, నేను మాత్రం ఏమైనా తక్కువ తిన్నానా అన్నట్టు చేతి గడియారము కూడా బాగా అడ్వాన్స్‌ అవుతూ వస్తోందండోయ్. అందుకే స్మార్ట్‌వాచ్‌ రిస్ట్‌ స్ట్రాప్స్‌, డయల్‌ కేస్‌లు కొత్త కొత్త వెరైటీలు వస్తున్నాయి ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్‌. ఆడామగా.. ఇద్దరికీ నచ్చేలా ఎన్నో రంగులూ, డిజైన్లూ ఉంటున్నాయి.

మరింత స్మార్ట్ గా(Smart Watches)

స్మార్ట్‌ వాచీలు మరింత స్మార్ట్‌గా కనిపించేలా హౌట్‌ సాస్‌ లాంటి కంపెనీలు రకరకాల మోడళ్లు వెరైటీల్లో వాచ్‌ స్ట్రాప్‌లు, డయల్‌ కేస్‌లను తయారు చేస్తున్నాయి. ఈ చైన్‌లు ఖరీదైన వాచీలను పోలి ఉండటంతో ఈ స్మార్ట్‌ వాచీలకు మరో నయా లుక్‌ వస్తున్నది.

వెరైటీ ఎప్పుడూ ఫ్యాషన్‌కు అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకే స్మార్ట్‌ వాచ్‌ డయల్‌ కేసులు, స్ట్రాప్‌లలో కూడా ఎన్నో రకాలు రూపు దిద్దుకుంటున్నాయి. లగ్జరీ వాచీల చెయిన్‌లను తలపించేలా బంగారం, రోజ్‌గోల్డ్‌, కాపర్‌ తదితర లోహాలతో సాదా, రాళ్లు పొదిగినవీ వస్తున్నాయి. ముత్యాల వరుసలతోనూ రూపొందిస్తున్నారు. బ్యాంగిల్‌ బ్రేస్‌లెట్‌ లాంటివీ, బ్యాండ్‌ మోడల్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించేవీ ఉన్నాయి. అబ్బాయిల కోసం కూడా వివిధ రంగుల చారల మోడళ్లు తయారవుతున్నాయి.

Exit mobile version