Skin Tan Removal Tips: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చర్మ టాన్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఎండకాలంలో యూవీ కిరణాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా మన స్కిన్‌పై పడటం వల్ల నల్లగా మారిపోతుంది. దీనికి కారణం.. యూవీ కిరణాలు మెలనిన్‌ను ఉత్త్పత్తి చేస్తాయి. ఇవి మన చర్మాన్ని తాకగానే మెలనిన్ స్థాయి పెరిగిపోతాయి. అందుకే యూవీ కిరణాల నేరుగా మనకు తాకకుండ ఉండటానికి బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రిన్ తప్పనిసరిగా వాడాలి. అయితే ఇవి పూర్తి స్థాయిలో మన స్కిన్‌కి ప్రొటెక్షన్ ఇవ్వలేవు. తద్వారా మన స్కిన్ డల్‌గా మారుతుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో టాన్ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవుతూ మీ స్కిన్‌ని హెల్తీగా, బ్రైట్‌గా మార్చుకోవచ్చు.
టోనర్‌గా.. కీర, రోజ్ వాటర్
వేసవిలో కీర ఎక్కువగా దొరుకుతుంది. హైడ్రెషన్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. కీరను తినడంతో వల్ల బాడీలో నిటీ శాతం పెరుగుతుంది. అయితే మీరు బయటి నుంచి వచ్చిన తర్వాత ఎండవల్ల స్కిన్ మండినట్టుగా ఉంటుంది. అప్పుడు కట్ చేసిన కీర ముక్కలను కాసేపు అలా మీ ముఖంపై పేట్టుకుని రిలాక్స్ అవ్వండి. ఇందులో నీటీ శాతం ఎక్కువగ ఉంటుంది కాబట్టి స్కిన్ తేమగా మారతుంది. అలాగే టోనర్‌గా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే చర్మ నిగారింపుకు రోజ్ వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. యూవీ కిరణాల వల్ల చర్మం కంది ఎర్రపడుతుంది. ఈ రెడ్‌నెస్‌ని తగ్గించడంలో రోజ్ వాటర్ బాగా పని చేస్తుంది. చర్మంలోని pH స్థాయిలను మెరుపరుస్తుంది.
పసుపుతో ఫేస్ ప్యాక్
చాలా మంది పుసుపు వల్ల టానింగ్ అవుతుందని బయపడుతుంటారు. కానీ పుసుపు కూడా డీటానింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. పుసుపు యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనికి పెరుగుతో/పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇది క్రమంలో వాడుతుంటే ముఖంపై పిగ్మెంటేషన్‌ని కూడా తగ్గిస్తుంది. బియ్యం పిండిలో పసుపు, పాలు కలిపి ఆ పెస్ట్‌ని ముఖానికి ప్యాక్‌లో వేసుకుని కాసేపు అయ్యాక చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కూడా టానింగ్ తగ్గుతుంది.
ఎక్స్ఫోలియేషన్
చాలా మంది టానింగ్‌ని తొలగించుకోవడానికి ఎక్స్ఫోలియేషన్ పద్దతిని అనుసరిస్తారు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి చర్మానికి మంచి మెరుపును అందిస్తుంది. దీనికి కోసం చాలా మంది బ్యూటీ సెలూన్, క్లినిక్స్‌కి వెళ్లి డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇది అందరికి సాధ్యపడదు. అలాంటి వారు ఇంట్లోనే ఎక్స్ఫోలియేషన్ చేసుకోవచ్చు. ఓట్‌మీల్, శనగపిండితో ఇంట్లోనే ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. ఓట్‌మీల్, శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక దీనిని నీటి అద్దుతూ మృదువుగా ఫింగర్ టిప్స్‌తో మసాజ్ చేసుకోవాలి. ఇది స్క్రిబ్‌గా పని చేసి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి మెరుపును అందిస్తుంది. చర్మం రంగును మెరుగుపరిచి టాన్‌ను తొలగిస్తుంది.
హైడ్రేషన్
ఎండకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. లేదంటే నీటి శాతం తగ్గి త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. దీనివల్ల స్కిన్ డల్‌గా, నిర్జీవంగా మారుతుంది. నలుపుదనం పెరుగుతుంది. కాబట్టి అప్పుడు కలబంద ఉపయోగించవచ్చు. ఇది ఎండనుంచి స్కిన్‌ని కాపాడుతుంది. కలబందలోని ఎంజైమ్‌లు, విటమిన్లు స్కిన్ ర్యాష్‌లను సైతం దూరం చేస్తాయి. అంతేకాకుండా నీటిని, సహజమైన జ్యూస్‌లను కూడా తాగితే హైడ్రేటెడ్‌గా ఉంటారు. తరచూ కలబంద ఉపయోగించడం వల్ల పిగ్మెంటేషన్ కూడా పోతుంది.