Site icon Prime9

Liver Disease: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? – అయితే జాగ్రత్త, మీ లివర్‌ ప్రమాదంలో పడినట్టే!

Liver Diseses

Liver Diseses

Symptoms of Liver Malfunction: మనిషి శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలేయం (Liver Disease) ఒకటి. ఈ కాలేయమే.. రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదే విధంగా పైత్యరసాన్ని స్రవించడం వల్ల జీర్ణక్రియ బాగ జరుగుతుంది. మనిషి గుండె, జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే ముందు కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. దాని పనితీరు బాగుండాలి. అయితే కాలేయం అనేది తనని తాను శుద్ది చేయడమే కాదు ఇతర భాగాలను సైతం శుద్ధి చేస్తుంది.

మన ఆరోగ్యం విషయంలో ముఖ్య పాత్ర పోషించే లివర్‌ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం చేసే తప్పిదాల వల్ల లివర్‌ ప్రమాదంలో పడుతుంది. అలాంటి సమయంలో ఈ కాలేయం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. అప్పుడే దానిని గర్తించి జాగ్రత్త పడితే ప్రమాదం నుంచి బయటపడోచ్చు. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఇంతకి లివర్‌ పంపే సంకేతాలు ఏంటి? మీలో ఎలాంటి మార్పులు చూపిస్తుందో చూద్దాం.

మూత్రం రంగులో మార్పు

మూత్రం రంగులో మార్పు కనిపిస్తే కిడ్నీ, లివర్‌లో సమస్యలున్నట్లుగా గుర్తించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పిత్త రసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి, చివరికి మూత్రవిసర్జన, మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీరు నీళ్లు సరిగ్గా తాగకపోయినా మూత్రం ముదురు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు సరిపడా నీళ్లు తాగినా.. మీ మూత్రం ముదుర రంగులో ఉంటే లివర్‌ సమస్యలో ఉన్నట్టే. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

దీర్ఘకాలిక అలసట

మనిషి పదే పదే అలసిపోతున్నాడు అంటే కాలేయంలో ఏదైన సమస్య ఉన్నట్టే. కాలేయ వ్యాధి ఉన్నవారిలో దీర్ఘకాలిక అలసట ఉంటుంది. అలా అనిపిస్తే తప్పనిసరి వైద్యుడిని సంప్రదించాలి.

కళ్లు పసుపు రంగులోకి మారితే..

కొన్ని వ్యాధుల లక్షణాలు కళ్ల ద్వారానే గుర్తిస్తారు. ఒక మనిషికి కామెర్లు, హైపటైటిస్‌ సోకితే వెంటనే కళ్లు చెప్పేస్తాయి. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు నిద్ర లేవగానే కళ్ల రంగు పసుపు రంగులోకి మారితే.. లివర్‌ ప్రాబ్లమ్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే. అలాంటి వారు వెంటనే‌ డాక్టర్‌ను కలవడం మేలు.

కడుపు నొప్పి

అప్పుడప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మనం తీసుకునే ఆహారం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కడుపులో అసౌకర్యంగా అనిపించడం, వికారం, వాంతి అనిపించడం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయంటే నిర్లక్ష్యం చేయకండి. దీనిని కాలేయ సమస్యగా భావించాలి. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఈ సమస్యమిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటే మీ లివర్‌లో ఏదో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. అలాగే హఠాత్తుగా చేతులు, కాళ్లు వాపు వస్తే కూడా లివర్‌ పనితిరు సరిగా లేదని గుర్తించాలి. ఈ సమస్యలు మీకు తలెత్తితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

నోటి దుర్వాసన..

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అయితే కొన్ని నియమాలు పాటించడం, పరిశుభ్రతను పాటిస్తే ఆ సమస్య తగ్గుపోతుంది. అయితే మీరు ఎంత పరిశుభ్రత పాటించిన మీ నోరు దుర్వాసన వస్తుందంటే మీరు వెంటనే అలర్ట్‌ అవ్వాల్సిందే. ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు నోటి శుభ్రత పాటించినా.. దుర్వాసన సమస్య ఉంటే డాక్టర్‌ను కలవడం మేలు.

Exit mobile version
Skip to toolbar