Site icon Prime9

Laptop Cleaning: ల్యాపీని క్లీన్ చేసేటప్పుడు ఇవి పాటిస్తున్నారా?

Laptop Cleaning

Laptop Cleaning

Laptop Cleaning: ఈ రోజుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించని వారెవరున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అవి భాగమయ్యాయి. అందులో ల్యాప్ టాప్ కూడా ఒకటి. అయితే ల్యాప్ టాప్ ఉపయోగించుకుంటే సరిపోదు కదా.. దాని శుభ్రంగా కూడా ఉంచుకోవాలి. అయితే ఈ క్రమంలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. దాని వల్ల ల్యాప్ టాప్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ల్యాపీ శుభ్రం చేసుకునేటపుడు కొన్ని పద్దతుల ఫాలో అవ్వాలంటున్నారు నిపుణలు. మరి అవేంటో చూద్దాం.

ల్యాప్ టాప్ మొత్తాన్ని క్లీన్‌ చేయకపోయినా.. ప్రతిరోజు మాత్రం స్క్రీన్‌ తుడవటం అందరికీ అలవాటు ఉంటుంది. అయితే ఈ క్లీనింగ్ కు చాలామంది కిచెన్‌ టవల్స్‌, పేపర్‌ న్యాప్‌కిన్లు.. లాంటివి యూజ్ చేస్తారు. అయితే అవి గరుకుగా ఉండటం వల్ల స్క్రీన్‌పై సన్నని గీతలు పడే అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి ల్యాపీ స్క్రీన్‌ను మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది.

 

అదే విధంగా ల్యాప్‌టాప్‌ కీబోర్డు గ్యాపుల్లో దుమ్ము ఎక్కువగా చేరుతుంది. ఆ దుమ్మును తీయడానికి చాలా మంది హెయిర్‌ బ్రష్‌, టూత్‌ బ్రష్‌.. లాంటి హార్డ్ బ్రిజిల్స్‌ ఉండే బ్రష్‌ వాడుతుంటారు. అయితే వాటితో శుభ్రం చేయడం వల్ల కీబోర్డ్‌ కీస్‌ అటూ ఇటూ కదులుతూ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువట. అలాగే అవి వదులుగా కూడా తయారవుతాయి. కాబట్టి వాటిరి బదులుగా స్మూత్ గా ఉండే మేకప్‌ బ్రష్‌ లేదంటే సన్నటి పాయింట్‌ ఉన్న పెయింట్‌ బ్రష్‌ లాంటివి వాడితే కీబోర్డ్‌ డ్యామేజ్‌ కాకుండా దుమ్మును తీసేయోచ్చు.

 

ల్యాప్ టాప్ మూలల్లో, చాలా తక్కువ గ్యాప్‌ ఉన్న భాగాల్లో దుమ్మును వదిలించడం అంత ఈజీ కాదు. అందుకే దీనికోసం కంప్రెస్‌డ్‌ ఎయిర్ టూల్స్‌ని వాడుతుంటారు. అయితే దాని నుంచి బలంగా, వేగంగా వచ్చే గాలి కారణంగా ల్యాప్‌టాప్‌లో ఉండే అతి సున్నితమైన భాగాలు, ల్యాప్‌టాప్‌ ఫ్యాన్‌ బ్లేడ్స్‌ దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. పైగా కీ బోర్డు పైనా ఈ టూల్‌ని వాడడం వల్ల కీస్‌ వదులుగా మారే అవకాశం ఉంది. అందుకే ల్యాపీ క్లీనింగ్‌ కోసం ఎయిర్ టూల్స్ వాడకపోవడమే మంచిది.

 

టీవీ స్క్రీన్‌, ఫ్రిజ్, కిటికీ అద్దాలు లాంటి వాటికి శుభ్రం చేసే లిక్విడ్స్‌నే ల్యాప్‌టాప్‌ క్లీనింగ్‌ కోసం కూడా యూజ్ చేస్తారు. అయితే వీటిలోని రసాయనాల వల్ల ల్యాపీ స్క్రీన్‌ కోటింగ్‌ దెబ్బతింటుందనేది నిపుణుల మాట. కాబట్టి ఆ లిక్విడ్స్ కు బదులుగా మార్కెట్లో ల్యాప్‌టాప్‌ కోసం ప్రత్యేకమైన క్లీనింగ్‌ లిక్విడ్స్‌ దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా నేరుగా స్ప్రే చేయకుండా.. మైక్రోఫైబర్‌ క్లాత్‌పై స్ప్రే చేసి.. దాంతో ల్యాప్ టాప్ ను క్లీన్‌ చేయడం ఉత్తమం.

అదేవిధంగా ల్యాప్‌ టాప్‌ క్లీన్‌ చేస్తున్న ప్రతిసారీ పవర్ కనెక్షన్‌ లేకుండా చూసుకోవాలి. ల్యాప్ టాప్ బాగా వాడిన వెంటనే కాకుండా.. ఉపయోగించే ముందు క్లీన్‌ చేయడం మంచిది.

Exit mobile version