Mud Utensils: మన కిచెన్‌లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్‌ఐఎన్) తాజగా ఓ గైడ్‌ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్‌గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ప్రజల లైఫ్‌స్టయిల్‌తో సాధారణంగా కొన్ని జబ్బులు చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో భారతీయుల ఆహారపు అలవాట్లులో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే మన కిచెన్‌లో ఏ పాత్రతో వంటలు చేసుకుంటే పోషక విలువలు తగ్గకుండా మన ఆరోగ్యానికి సహకరిస్తాయని ఎన్‌ఐఎన్ తాజాగా విడుదల చేసిన గైడ్‌లో వివరించింది.
పర్యావరణానికి అనుకూలం..( Mud Utensils)
ప్రధానంగా మట్టి పాత్రతో వంట చేసుకుంటే బోలేడన్ని లాభాలు ఉంటాయని తెలిపింది. మట్టి పాత్రతో వంట చేసుకోవడం అంటేనే పర్యావరణానికి అనుకూలం… దీంతో పాటు వంటనూనెల అవసరం కూడా తగ్గుతుంది. అదే సమయంలో ఆహారంలో పోషక విలువలు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని పేర్కొంది. మట్టి పాత్రల్లో వంట చేసుకుంటే పోషక విలువలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం రుచిచూస్తారని క్లినికల్ బెంగళూరులోని న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ హెడ్ ఎడ్వినా రాజ్ వివరించారు. మట్టి పాత్రలో వంట చేసుకుంటే వంటపాత్రకు వేడి సమానంగా విస్తరిస్తుంది. దీంతో ఆహారంలోని పోషక విలువలు తగ్గవని ఆమె వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహారం కావాలనుకునే వారు మాత్రం మట్టిపాత్రలో వంట వండుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆమె వివరించారు. అయితే దీనికి తగ్గట్టు క్లినింగ్ మెళుకవలు తెలుసుకుంటే ఇంటిల్లిపాది కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు ఎడ్వినా రాజ్.
నాన్ స్టిక్ పాత్రలతో ఆరోగ్య సమస్యలు..
గతంతో పాటు ప్రస్తుతం చాలా మంది ఇప్పటికి టెప్లాన్ కోటెడ్ నాన్ స్టిక్ కోటింగ్ వంట పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే నాన్ స్టిక్ పాత్రల్లో వంట వండుకుంటే .. ఆ పాత్రల నుంచి ఫర్‌ప్లూరోఓక్టానిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఈ యాసిడ్ ద్వారా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉదాహరణకు కేన్సర్, థైరాయిడ్, పుట్టబోయే బిడ్డల్లో కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంటుందని రాజ్ వివరించారు. అయితే అదృష్టవశాత్తు కుకింగ్ ఇండస్ర్లీస్ దశలవారీగా 2013 నుంచి ఫర్‌ప్లూరోఓక్టానిక్ యాసిడ్‌ద్వారా చేసే నాన్‌స్టిక్ కోటింగ్ పాత్రల ఉత్పత్తిని నిలిపివేయడం ప్రారంభించింది.
ఇక నాన్ స్టిక్ పాన్‌ల విషయానికి వస్తే ఓవర్‌హీటింగ్ రిస్క్‌తో కూడుకుంది. ఓవర్ హీటింగ్‌వల్ల ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతాయి. ఈవాయువులు ఊపిరితిత్తులోకి పోయి ఫ్లూ లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే పాలిమర్ ఫీవర్ అంటారని ఆమె వివరించారు. సురక్షితమైన ఆహారం వండుకోవాలనుకునే వారు .. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను వాడుకోవడమే మేలని ఆమె అన్నారు. ఎందుకంటే వినియోగించుకోవడం తేలిక, అలాగే శుభ్రం చేసుకోవడం కూడా తేలికనే… అదే సమయంలో పరిశుభ్రమైన ఎంపిక…. అయితే మట్టితో చేసిన పాత్రలతో వండుకుంటే ఆరోగ్యానికి మేలు. పోషక విలువలు కోల్పోం. అయితే వాటిని శుభ్రం చేసుకోవడమే సమస్య.. శుభ్రం చేసుకోగలం అనుకుంటే అత్యుత్తమైంది మట్టి పాత్రలే అని ఎడ్వినా రాజ్ పేర్కొన్నారు.