Site icon Prime9

Home Remedies: ఈ హోం రెమెడీస్‌‌తో.. జలుబు, దగ్గు క్షణాల్లోనే మాయం

Home Remedies

Home Remedies

Home Remedies:  జలుబు, దగ్గు అనేవి పిల్లలలో ఒక సాధారణ సమస్య. ఇది తరచుగా మారుతున్న వాతావరణం, చల్లని వాతావరణం లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కానప్పటికీ.. పిల్లలు దీని కారణంగా చాలా అసౌకర్యంగా ఉంటారు. ఇలాంటి సమయంలో అమ్మమ్మ కాలం నుండి వాడుతున్న కొన్ని సులభమైన, ప్రభావవంతమైన హోం రెమెడీస్ వాడటం మంచిది.

పిల్లలకు జలుబు,దగ్గు తగ్గాలంటే ?
జలుబు, దగ్గులో అల్లం, తేనె కలయిక చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దగ్గు, జులుబు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హోం రెమెడీ కోసం అల్లం నుంబి రసం తీసి దానికి ఒక చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని పిల్లలకు రోజుకు రెండు మూడు సార్లు పిల్లలకు ఇవ్వండి. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి, జలుబును నయం చేయడానికి సహాయపడుతుంది.

పసుపు పాలు:
పసుపులోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు , దగ్గును తక్కువ సమయంలోనే తగ్గిస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి పడుకునే ముందు పిల్లలకు ఇవ్వండి. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా పిల్లల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఆవిరి:
జలుబు వల్ల పిల్లల ముక్కు మూసుకుపోయి ఉంటే.. ఆవిరి పట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి నీటిలో కొంచెం విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి పిల్లలకు ఆవిరి పట్టండి. ఆవిరి వల్ల పిల్లలు ప్రమాదం ఉండదు. కానీ దీనిని జాగ్రత్తగా చేయండి. ఇది సైనస్‌లను తెరవడానికి, శ్వాసను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

తులసి, నల్ల మిరియాలు:
జలుబు, దగ్గుకు తులసి, నల్ల మిరియాలు కషాయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ నీటిలో తులసి ఆకులు, నల్ల మిరియాలు, అల్లం వేసి మరిగించాలి. దానికి తేనె కలిపి, వేడి చేసి, పిల్లలకు రోజుకు 2-3 టీస్పూన్లు ఇవ్వండి. ఇది గొంతు నొప్పిని నయం చేయడంలో , జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి:
ఒక పాన్ మీద తులసి తేలికగా వేడి చేసి,.. దానిని కాటన్ క్లాత్‌ లో కట్టి కట్టగా చేయండి. పిల్లలు ఛాతీ , వీపుపై సున్నితంగా రుద్దండి. వాముయొక్క వేడి లక్షణాలు మూసుకుపోయిన ముక్కు , ఛాతిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ నివారణలు పాటించడం ద్వారా.. పిల్లలు జలుబు , దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇవి ప్రభావవంతంగా ఉండటమే కాకుండా.. పూర్తిగా సురక్షితమైనవి కూడా.

Exit mobile version
Skip to toolbar