Site icon Prime9

Holi Precautions: హోలీ ఆడుతున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Holi Festival celebrations Precautions and Measures: హోలీ పండుగ వచ్చేసింది. ఆనందాన్ని పంచే ఈ పండుగ సందర్భంగా చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుుల వేసుకోవడం సహజమే. అయితే గతంలో సహజంగా లభించే చెట్ల ఆకులతో తయారుచేసుకున్న రంగులను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. కానీ కాలానుగుణంగా రసాయనిక, సింథటిక్ రంగుల వాడకం పెరిగిపోతూ వస్తోంది.

 

దీంతో పాటు ఈ మధ్య కాలంలో కోడిగుడ్లు విసరడం ఎంజాయ్‌గా మారింది. అయితే ప్రస్తుతం సింథటిక్ రంగుల వాడకం ఎక్కువగా పెరుగుతోంది. ఈ రంగులు నేరుగా చర్మం, జుట్టుపై ప్రభావం చూపుతున్నాయి.దీంతో చర్మవ్యాధులు, దద్దుర్లు ఏర్పడడంతో పాటు జుట్టు పాడవడం, కళ్లు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో హోలీ ఆడే సయమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

 

– చిన్న పిల్లలు హోలీ ఆడే సమయంలో తల్లిదండ్రులు వారితో ఉండడంతో పాటు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి
– రంగులు కళ్లల్లో పడకుండా ఉండేలా కళ్లద్దాలు ధరించాలి.
– కళ్లల్లో రంగులు పడకుండా కంటి చుట్టూ కొబ్బరి నూనె లేదా వ్యాజిలైన్ ఉపయోగిస్తే రంగులు కంటిలోకి వెళ్లకుండా ఉంటాయి. అలాగే చేతులు, పాదాలు, ముఖానికి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

 

– శరీరాన్ని కప్పి ఉంచే పుల్ స్లీవ్స్ ధరించాలి. జుట్టు పాడవకుండా ఉండేందుకు స్కార్ప్ ఉపయోగించాలి.
– కనీసం ఎస్పీఎఫ్ 30 సన్ స్క్రీన్ ని రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
– హోలీ ఆడే ముందు నెయిల్ పాలిష్ చేసుకుంటే గోళ్లు పాడవకుండా ఉంటాయి.
– రసాయన రంగులకు బదులు సహజ సిద్దంగా ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవాలి.
– పసుపు, బంతిపూలు, గులాబీతోపాటు మందార పూలను ఉపయోగించి రంగులను తయారు చేసుకోవచ్చు.
-హోలీ పండగ పూర్తయిన తర్వాత వేడి నీళ్లల్లో స్నానం చేస్తే మంచిది.

 

 

Exit mobile version
Skip to toolbar