Prime9

Ear infection: చెవి నొప్పి తగ్గించడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలు!

Home Remedies: వర్షాకాలంలో మనం అనేక ఇబ్బందులను, వాటితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్‌తో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు ఎక్కువుగా వస్తాయి. ఈ సీజన్‌లో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అంతే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ, చెవి ఇన్ఫెక్షన్లు కూడా వర్షాకాలంలో మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.

వర్షపు నీటి వల్ల చాలా మందికి తీవ్రమైన చెవి నొప్పి అలాగే చెవులు తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే, వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలు. వీటిని పాటించడం వల్ల వర్షాకాలంలో ఇబ్బంది పెట్టె చెవి సమస్యను నివారించవచ్చు.

ఈ చిట్కాలను పాటిస్తే చాలు..

1.చెవులను ఎప్పుడు పొడిగా ఉంచండి.
2.చెవులు మృదువైన కాటన్ తో తుడవకూడదు.
3.చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం మంచిది కాదు.
4.అలాగే ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను మీరు ఉపయోగించకండి.
5.ఇయర్ బడ్స్ వాడకండి.
6.ఇయర్ బడ్స్ చెవిలో ఇన్ ఫెక్షన్ని పెంచుతాయి.
7.ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇయర్‌ఫోన్‌లను శుభ్రం చేసుకుంటూ ఉండండి.
8.గొంతును జాగ్రత్తగా చూసుకోండి.
9.చెవి ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు నొప్పి పెరుగుతుంది.

Exit mobile version
Skip to toolbar