Site icon Prime9

Yoga: రోజు వ్యాయామం చేస్తే ఎన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసా..!

Yoga: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ఇతరత్రా కారణాలతో ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు పలు అనారోద్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారు. హార్ట్ ఎటాక్ లతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇటీవల కాలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఎక్కువగా గుండె జబ్బులు దారి చేరకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రోజూ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులు మాత్రమే కాకుండా పలు సమస్యల నుంచి దూరం కావొచ్చని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

గుండె జబ్బు , అధిక రక్తపోటు(Yoga)..

శారీరక శ్రమ మీ గుండెను బలంగా చేస్తుంది. వ్యాయామం మీ శరీరం అంతటా ప్రసరణ కోసం రక్తాన్ని పంప్ చేసే మీ గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటును కూడా నియంత్రించడంలో సహాయ పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె బలంగా మారి తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. దాంతో అధిక రక్తపోటును తగ్గించవచ్చని చెబుతున్నారు.

ఒత్తిడి, ఆందోళన..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాగా రోజు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్‌లు అని పిలువబడే మంచి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో ఒత్తిడిని దూరం చేయవచ్చు అని సూచిస్తున్నారు. అలానే వ్యాయామం మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

మధుమేహం

ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఒక సారి వచ్చిందంటే మనం చనిపోయేదాకా ఉంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోలేం. కేవలం నియంత్రించాల్సి ఉంటుది. అయితే చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా మారుతుంది. ఇది మీ శరీరంలోని కణాలు శక్తి కోసం రక్తంలో చక్కెరను ఉపయోగించుకునేలా చేస్తుంది. దీనివల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

కొలెస్ట్రాల్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఊబకాయం నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే రోజూ వ్యాయామ చేస్తే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది పెరిగితే ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

బరువు

అధిక బరువు కూడా ఎన్నో రోగాలను దారితీస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. మీరు వ్యాయామం చేస్తే మీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

 

Exit mobile version