Breakfast: ఎక్కువ కాలం రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండే పరిస్థితిని హైపర్ గ్లైసీమియా అంటారు. ఇది ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను దెబ్బతీస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని పెంచే కారణాలలో పేలవమైన ఆహారపు అలవాట్లు ఒకటి.
ఈ కింద చెప్పిన 4 అనారోగ్యకరమైన అల్పాహార అలవాట్లు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
1. అల్పాహారం మానేయడం
ఉదయంపూట అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి హానికరం. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీలో మెడిసిన్ ప్రొఫెసర్ అయిన డి డానియెలా జకుబోవిచ్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు అల్పాహారం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని తేలింది. అందువలన ఎట్టిపరిస్దితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ మానకూడదు.
2. ప్రోటీన్ లోపం
అల్పాహారంలో ప్రోటీన్ లోపం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. బీన్స్, కాయధాన్యాలు, గింజలు, చేపలు మొదలైన పదార్దాల్లో ప్రోటీన్లు ఉంటాయి. వీటినిఅల్పాహారంలో ఉండేవిధంగా చూసుకోవాలి.
3. కొవ్వు లోపం
కొవ్వులు లేని అల్పాహారం డయాబెటిక్ రోగులకు ఇబ్బందికరం. ఎందుకంటే కొవ్వులు జీర్ణక్రియ ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను కూడా తగ్గిస్తుంటాయి.
4. బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ లేకపోవడం
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను లక్ష్య పరిధిలో ఉంచడంలో సహాయపడుతుంది. అందువలన బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.