Site icon Prime9

Gardening: గార్డెనింగ్ ద్వారా మానసిక ఉల్లాసం

Lifestyle: గార్డెనింగ్ ద్వారా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని పొందగలరని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. తోటపని కార్యకలాపాలు వారానికి రెండుసార్లు గార్డెనింగ్ తరగతులకు హాజరయ్యే ఆరోగ్యకరమైన మహిళల్లో ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించాయని వారు కనుగొన్నారు.

26 మరియు 49 సంవత్సరాల మధ్య వయస్సు గల 32 మంది మహిళలను ఈ అధ్యయనానికి తీసుకున్నారు. గార్డెనింగ్ తరగతులకు హాజరయే ముందు తరువాత వారి మానసిక ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు తేలింది. గార్డెనింగ్ సెషన్‌లలో, పాల్గొనేవారు విత్తనాలను నాటడం, వివిధ రకాల మొక్కలను మార్పిడి చేయడం, మొక్కలను పెంచడం, కాయలను రుచి చూడటం చేసారు. వారు ఇంతకు ముందెన్నడూ తోటపని చేయకపోయినా ఈ మెక్కల పెంపకం ద్వారా మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందారని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మెరుగైన ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి గార్డెనింగ్‌ను ఉపయోగించడాన్ని థెరప్యూటిక్ హార్టికల్చర్ అని పిలుస్తారు. ఇది 19వ శతాబ్దం నుండి ఉంది. మొక్కల చుట్టూ ఉండటం మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మానవ పరిణామం మరియు నాగరికత పెరుగుదలలో మొక్కల యొక్క పాత్ర వుందని ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు తెలిపారు.

Exit mobile version