Face Skin: మనలో చాలా మంది ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి పార్లర్ కు డబ్బులు తగలేస్తూ ఉంటారు. ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం సహజమైన మార్గాల ద్వారా మీ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి. మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుకుందాం.
నారింజ: నారింజలో విటమిన్ సి ఎక్కువుగా ఉంటుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరిగి చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మం మీద ముడతలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నారింజలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది.
బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి మనకు సమృద్దిగా దొరుకుతాయి. ఇది యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మొటిమలు, చర్మం మీద దురద, అల్సర్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గిన్నె బొప్పాయిని తినడం లేదా ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకున్నా మీ ముఖానికి మంచిగా ఉంటుంది.
ఉసిరికాయ: ఉసిరికాయలో కూడా విటమిన్ సి మనకి దొరుకుతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి మాత్రమే కాకుండా మీ జుట్టుకు, కళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: చేపలు , పెరుగు కలిపి తీసుకుంటే ఈ సమస్యలను స్వాగతించినట్లే !