Site icon Prime9

Anger Management Tips: కోపం బాగా వచ్చినప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

anger tips prime9news

anger tips prime9news

Anger Tips: మనుషులకు సంతోషం, బాధలా, కోపం కూడా ఒక ఫీలింగ్‌. ఎవరికైనా కోపం ఈజీగా వచ్చేస్తుంది. మనుషులల్లో కోపం రాని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కోపం విపరీతంగా వచ్చేస్తుంది. చాలా ప్రశాంతంగా, కూల్‌గా మనుషులకు కూడా ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది. కొంతమందికైతే ఇక చెప్పాలిసిన అవసరం లేదు. ఆ సమయంలో ఏవి చేతిలో ఉంటే అవి పగలుకొడతారు. ఎంత ప్రయత్నించిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి సమయంలో ఈ చిట్కాలను పాటించండి.

డీప్ బ్రీత్ తీసుకోండి..

డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుంది. మీకు దేని వల్ల ఐతే కోపం వస్తుందో దాన్ని మైండు నుంచి తీసేయండి.
వాకింగ్ చేయండి..
వాకింగ్‌ వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి మంచిది. వాకింగ్‌ చేయడం వల్ల మీ కండరాలను రిలాక్స్‌ అయి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది.
పాటలు వినండి..
పాటలు వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం రోజు చేసే పని అదే కదా. బాగా కోపం వచ్చినప్పుడు మెలోడీ పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత, విశ్రాంతిని ఇస్తాయి. మీరు కోపంగా, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మంచి ఫీల్ గుడ్ పాటలను వినండి.
మీతో మీరు సమయాన్ని గడపండి..
ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయం గడపడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఒంటరిగా మీతో మీరు సమయాన్ని గడపండి.

Exit mobile version