Site icon Prime9

Janasena: జనసేన పార్టీలో చేరిన వైసీపీ నేత ముద్రగడ కుమార్తె

Mudragada Daughter Joins in Janasena

Mudragada Daughter Joins in Janasena: వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు కండువ కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట పురపాలక కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు కూడా జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా జనసేనాని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు. అదే విధంగా కలుషిత తాగునీటి సమస్యను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన ద్రష్టికి తీసుకొచ్చారని, పరిష్కారానికి మొదట విడతలో రూ. 91 లక్షలతో ఫిల్టర్‌బెడ్లు ఇతర పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

Exit mobile version