Site icon Prime9

Daggubati Rana : అన్న రానాతో కలిసి పిజ్జాలు చేసిన వెంకటేష్ కుమార్తె ఆశ్రిత..

venkatesh daughter asritha making pizza along with daggubati rana

venkatesh daughter asritha making pizza along with daggubati rana

Daggubati Rana : తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంది. మూవీ మొఘల్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పలు భాషల్లో వందల చిత్రాలు నిర్మించిన గొప్ప నిర్మాత. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక పోతే నేటి తరం హీరోల్లో దగ్గుబాటి యంగ్ హీరో రానాకి నటుడిగా మంచి గుర్తింపు ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ అందుకున్న ఈ హీరో.. కేవలం హీరోయిజం చిత్రాలే కాకుండా.. కంటెంట్ నచ్చితే చాలు ఎంతటి చిన్న సినిమా అయిన చేసేందుకు ముందున్నాడు. తెలుగులో చివరగా విరాట పర్వం చిత్రంలో సాయి పల్లవికి జోడిగా నటించారు రానా. ఇక ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలో సందడి చేశారు. ఇప్పుడు తాజాగా తన చెల్లితో కలిసి ఒక ఫన్ వీడియోలో భాగం అయ్యారు.

అయితే హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ బేకర్ అయిన ఆశ్రిత.. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత. ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో బేకరీ ఫుడ్స్ బిజినెస్ చైన్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పేరుతో ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. గతంలో తన బావ నాగ చైతన్యతో కలిసి పలు వంటలు చేసిన ఆశ్రిత.. ఇప్పుడు తన అన్నయ్య రానాతో కలిసి పిజ్జాలు రెడీ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఆశ్రిత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దగ్గుబాటి రామానాయుడు నివాసం ఉన్న ఆ పాత ఇంట్లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్టారు రానా. జూబ్లీహిల్స్ ఏరియాలోని రామానాయుడు స్టూడియోస్ పక్కనే ఈ ఇల్లు ఉంది. అక్కడ ఎన్నో అందమైన కళాకృతులు భారీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్.. కిచెన్ దేనికదే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఇంటిని శాంక్చువరీ పేరుతో ఓ రెస్టారెంట్ గా మార్చి రానా స్నేహితుడు రన్ చేస్తున్నారట. ఇక ఇక్కడే తన చెల్లెలు ఆశ్రితతో కలిసి నేరుగా పిజ్జాలు తయారు చేశాడు రానా. అసలు పిజ్జా ఎలా తయారవుతుందో అంటూ అన్నాచెల్లెళ్లు మాట్లాడిన తీరు ఆకట్టుకోగా.. తన మాటలతోనే రానాను ఆటాడుకుంది ఆశ్రిత.

అదే విధంగా ఆ ఇంట్లో వారు గడిపిన మధుర క్షణాలను, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అతడితో పాటు.. ఆ ఇంట్లో తన అల్లరి పనులు గురించి ఆశ్రిత చెప్పుకొచ్చింది.. తన ఫేవరెట్ బాల్కనీని రానా చూపించారు. మొత్తానికి అన్నయ్యతో కలిసి ఆశ్రిత చేసిన సరదా వీడియో ఆకట్టుకుంటుంది. ఇక వీడియో చివర్లో రానా భార్య మిహీకా, అతని స్నేహితుడుకూడా పాల్గొని కొద్దిపాటి ముచ్చట్లు పెట్టుకున్నారు.

Exit mobile version