Site icon Prime9

Samantha: సమంతతో నటించవద్దని బెదిరించారు – ఆమె గురించి నెగిటివ్‌గా చెప్పారు: హీరో షాకింగ్‌ కామెంట్స్‌

Varun Dhawan About Samantha

Varun Dhawan - Samantha

Varun Dhawan About Negative Comments on Samantha: సమంత ప్రస్తుతం తన లేటెస్ట్‌ వెబ్‌ సరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో సామ్‌ జతకట్టింది. బాలీవుడ్‌ డైరెక్టర్స్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ మరికొద్ది రోజుల్లో అమెజాన్‌ ప్రైంలో విడుదల కాబోతోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌ను గ్రాండ్‌గా ప్రమోట్‌ చేస్తుంది టీం. శాకుంతలం, పుష్ప చిత్రాలతో సమంత పాన్‌ ఇండియా క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అంతకుముందే ఆమె బాలీవుడ్‌ ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే. గతంలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సరీస్‌ బి-టౌన్‌ ఆడియన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంది. అమెజాన్‌ ప్రైంలో రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌ రికార్డు వ్యూస్‌ టాప్‌లో నిలిచింది.

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మరోసారి సిటాడెల్‌తో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని అలరించబోతుంది. ప్రస్తుతం ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ తెచ్చుకున్న సమంతకు విడాకులు తర్వాత కాస్తా నెగిటివిటీ పెరిగిన సంగతి లిసిందే. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో తరచూ ఆమె ట్రోల్‌కు గురవుతుంది. తనకు యాటిట్యూడ్‌ ఎక్కువ అని, అదే తన వైవాహిక జీవితం ముక్కలు కావడానికి కారణమైందంటూ నెటిజన్స్‌ అంతా నెగిటివ్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ స్పందించారు. తమ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అతడు సమంతపై వచ్చిన నెగిటివ్‌ కామెంట్స్‌పై స్పందించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ తనని సమంతతో నటించొద్దని కొందరు బెదిరించారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

“నిజానికి సమంతతో కలిసి నటించే అవకాశం రావడంతో నేను చాలా సంతోషించాను. గతంలో ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేశాను. అప్పుడే ఆమెను ఫ్యాన్స్‌ అయిపోయా. అప్పుడు అవకాశం వస్తే తనని నటించాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్టే తనతో సిటాడెల్‌లో నటించే చాన్స్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ రావడంలో చాలా సంతోషించాను. అదే సమయంలో నాతో కొంత మంది సమంత గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. పైగా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మీ ఇద్దరి పెయిర్‌ అస్సలు కుదరదు. తన అనారోగ్యం వల్ల షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయలేదు. తనతో నటించోద్దు అని బెదిరించారు. అయినప్పటికీ నేను తనతో నటిస్తానని వారికి తెల్చి చెప్పేశా” అంటూ వరుణ్‌ ధావన్‌ చెప్పుకొచ్చాడు. అయితే తనతో ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనేది మాత్రం చెప్పలేదు కానీ, ఇండస్ట్రీలోని వారే అంటూ హింట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

Exit mobile version