Used Cars: చాలా మంది తమ కార్లను విక్రయించి కొత్త కార్లను కొనాలని చూస్తుంటారు. వారి పాత కారు అమ్మే సమయంలో దానికి మంచి ధర రావాలంటే.. కొన్ని విషయాలను మనం గమనించాలి. పాత కారును అమ్మే సమయంలో కచ్చితంగా ఇవి పాటిస్తే వాటికి మంచి ధర పలికే అవకాశం ఉంది.
ఇలా చేయండి.. (Used Cars)
చాలా మంది తమ కార్లను విక్రయించి కొత్త కార్లను కొనాలని చూస్తుంటారు. వారి పాత కారు అమ్మే సమయంలో దానికి మంచి ధర రావాలంటే.. కొన్ని విషయాలను మనం గమనించాలి. పాత కారును అమ్మే సమయంలో కచ్చితంగా ఇవి పాటిస్తే వాటికి మంచి ధర పలికే అవకాశం ఉంది.
కొందరు కారు కొనే సమయంలో.. ముందుచూపుతో ఎక్కువ కాలం ఉండేలా చూసుకుంటారు. మరికొంత మంది కొన్నాళ్లు వాడిన కారును అమ్మేసి కొత్తది కొనాలని చూస్తారు.
మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు రాగానే.. పాతది విక్రయించి కొత్తది కొనే యోచనలో ఉంటారు.
కానీ వాడిన కారును ఎప్పడు విక్రయించాలో తెలుసుకోవాలి. ఇది తెలియక చాలా మంది.. తక్కువ ధరకే పాత కార్లను విక్రయిస్తున్నారు.
ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు..
కొందరు కారు కొన్న 4-5 ఏళ్లలోపు విక్రయిస్తే మంచి ధర వస్తుంది. అలాగే ఆ వాహనం లక్ష కి.మీల కన్నా తక్కువ తిరిగిన వాహనాన్ని విక్రయించడానికి ఉంచడం మంచిది.
దీంతో పాటు.. లోన్ పై తీసుకున్న వాహనాలను ఆ లోన్ పూర్తయ్యాక విక్రయించడం మేలు.
మార్కెట్ విలువ ప్రకారం కారు ధర ఎంత పలుకుతుందో కనుక్కోవడం ఉత్తమం. వచ్చే ఆరు నెలల్లో రాబోయే ఖర్చులు, నిర్వహణ వ్యయాలను అంచనా వేయండి.
ఈ రెండు కలిపితే వచ్చే మొత్తం మీరు కారు కొన్న ధర కంటే ఎక్కువైతే ఇక దాన్ని వదిలించుకోవడమే ఉత్తమం.
కారు కొన్న 5 ఏళ్ల తర్వాత దాని విలువ సగానికి అంటే 50 శాతం పడిపోతుంది. దీంతో ఆ తర్వాత పెద్దగా ధర రావడానికి అవకాశం ఉండదు.
కొందరు తమ కార్లను నిరూపయోగంగా ఉంచుతారు. దాని వల్ల ఆ కారు విలువ తగ్గిపోతు ఉంటుంది. అలాంటి సమయంలో ఆ కారును విక్రయించడం మేలు.
ఎలా విక్రయిస్తే మేలు..
డీలర్లు, తయారీదార్లకే నేరుగా కార్లను విక్రయించే వెసులుబాటు ఉంటుంది. తెలిసిన మెకానిక్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా అమ్మకానికి పెట్టొచ్చు.
ఆన్‌లైన్ వేదికగా కార్లను విక్రయించి పెట్టే వేదికలు చాలా ఉన్నాయి. వాళ్లకి చాలా మంది డీలర్లు అనుసంధానమై ఉంటారు. వాళ్లే మీ కారుని క్షుణ్నంగా తనిఖీ చేసి విలువ కడతారు.
చట్టపరమైన డాక్యుమెంటేషన్ కూడా పూర్తి చేస్తారు. పైగా ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీలు ఎంత ధర ఆఫర్ చేస్తాయో ముందే తెలుసుకొని పోల్చుకోవచ్చు.
ప్రయోజనాలనూ బదిలీ చేయాలి..
కారు విక్రయించిన తర్వాత దానిపై ఉండే అన్ని ప్రయోజనాలను కొనుగోలు చేసిన వారికి బదిలీ చేయాలి. రిజిస్ట్రేషన్ సైతం వారి పేరు మీదకు మార్చాలి.
ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా బదిలీ చేయాలి. లేదంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అది మీ మీదకు వచ్చే ప్రమాదం ఉంది.